Share News

ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలి

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:47 PM

ఉమ్మడి ప్రవేశ పరీక్షలను రద్దు చేసి ఇంటర్మీడియెట్‌ మార్కుల ఆధారంగా ఉన్నత, వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు.

 ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలి
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న వక్తలు

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు

గుజరాతీపేట, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ప్రవేశ పరీక్షలను రద్దు చేసి ఇంటర్మీడియెట్‌ మార్కుల ఆధారంగా ఉన్నత, వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) ఆధ్వర్యంలో సంఘం గౌర వాధ్యక్షుడు పి.కృష్ణారావు అధ్యక్షతన శని వారం విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత, ప్రజా సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీని రద్దు చేయా లన్నారు. ప్రైవేటు కార్పోరేట్‌ విద్యా సంస్థలను కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు నియంత్రణ లో ఉంచా లని, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవు తున్న సిలబస్‌, కరికులంను ప్రైవేటు కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో కూడా అమలు చేయాలని కోరారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు బి. మోహనరావు, కేవీజగన్నాథం, వాబయోగి, మామిడి శ్రీకాంత్‌, పి.ఖగేష్‌, డి.గణేష్‌, ఎస్‌. కిషోర్‌కుమార్‌, జి.గిరిధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 11:47 PM