సీఎంఆర్‌ఎఫ్‌తో పేదల ఆరోగ్యానికి భరోసా
ABN , Publish Date - May 04 , 2026 | 12:13 AM
రాష్ట్ర ప్రభు త్వం ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్)తో పేదల ఆరోగ్యానికి పూర్తి భరోసా కల్పిస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
- మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, మే 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్)తో పేదల ఆరోగ్యానికి పూర్తి భరోసా కల్పిస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆది వారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం టెక్కలి నియోజకవర్గానికి చెందిన 8 మంది లబ్ధి దారులకు రూ.5లక్షల చెక్కులను అం దజేశారు. ఇప్పటివరకు నియోజకవర్గం పరిధిలో పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.3.28 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజ రాపు హరివరప్రసాద్, నాయకులు తర్ర రామకృష్ణ పాల్గొన్నారు.
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కిం జరాపు అచ్చెన్నాయుడుకు కోటబొ మ్మళి మండలానికి చెందిన టీడీపీ నాయకులు ఆదివారం ఘనంగా స న్మానించారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన పలు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కాళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరా జులు, జిల్లా రైస్‌మిల్లుల సంఘం అధ్యక్షుడు బో యిన రమేష్, పార్టీ మండల అధ్యక్షుడు బోయిన సత్యశ్రీనివాస్, పీఏసీఎస్ అధ్యక్షుడు వెలమల విజ యలక్ష్మి కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.