Share News

పేదల ఆరోగ్యానికి భరోసా

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:49 PM

Distribution of CM Relief Fund cheques ప్రజారోగ్యమే లక్ష్యంగా పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో టెక్కలి నియోజకపరిధిలోని 11 మంది లబ్ధిదారులకు రూ.10,63,450 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

పేదల ఆరోగ్యానికి భరోసా
లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కోటబొమ్మాళి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యమే లక్ష్యంగా పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో టెక్కలి నియోజకపరిధిలోని 11 మంది లబ్ధిదారులకు రూ.10,63,450 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘వైసీపీ ప్రభుత్వం పేదల ఆరోగ్యం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోంది. వైద్యపరంగా ఆపదలో ఉన్నవారిని తక్షణమే ఆదుకునేలా నిధులు ఖర్చు చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అందిస్తున్నామ’ని తెలిపారు. అలాగే ప్రజాదర్బార్‌ నిర్వహించి వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి అచ్చెన్న ఆదేశించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, టీడీపీ నేతలు వెలమల కామేశ్వరరావు, పూజారి శైలజ, పట్ట సింహాచలం, పినకాన అజయ్‌కుమార్‌, మల్లా బాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 11:49 PM