ఎరువుల పంపిణీ సక్రమంగా చేపట్టండి
ABN , Publish Date - Jul 11 , 2026 | 11:49 PM
ఖరీఫ్ సీజన్‌లో సాగు నిమిత్తం చేపట్టిన ఎరువులు పంపిణీ సక్రమంగా చేపట్టేలా సంబంధిత అధికారులు చర్యలు తీసు కోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుం డ్కర్ ఆదేశించారు. శనివారం సరుబు జ్జిలి మండలం కాగితాపల్లి గ్రామ సచి వాలయం వద్ద నిర్వహిస్తున్న ఎరువుల పంపిణీ, ‘సర్’ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
సరుబుజ్జిలి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌లో సాగు నిమిత్తం చేపట్టిన ఎరువులు పంపిణీ సక్రమంగా చేపట్టేలా సంబంధిత అధికారులు చర్యలు తీసు కోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుం డ్కర్ ఆదేశించారు. శనివారం సరుబు జ్జిలి మండలం కాగితాపల్లి గ్రామ సచి వాలయం వద్ద నిర్వహిస్తున్న ఎరువుల పంపిణీ, ‘సర్’ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువులు పంపిణీని పరి శీలించిన కలెక్టర్ సహకార సంఘం క్షేత్రస్థాయి సిబ్బందిపై అసహనం వ్యక్తంచేసి రైతులను క్యూ లైన్‌లో ఉంచి సక్ర మంగా ఎరువులు పంపిణీ చేపట్టాలని ఆదేశిం చారు. రైతు సేవా కేంద్రం, గ్రామ సచివాయాల్లో నిర్వహించే ఎరువుల పంపిణీలో ఎటువంటి అక్రమాలు చోటు చేసు కోకుండా అర్హులైన ప్రతీ రైతుకు ఓటీపీ ద్వారా ఖరీఫ్ ఎరువులు అందే లా చర్యలు చేపట్టాలని, అవసరం మేరకు అన్ని ప్రాంతాలకు ఎరువుల సరఫరాకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘సర్’ కార్యక్ర మాన్ని ప్రారంభించి నెల రోజులు కావస్తోందని, శతశాతం పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. భూ ముల రీసర్వేలో భాగంగా కొంతమేర భూములు వెబ్‌లో నమోదు కాలేదని, అటువంటి భములకు ఎరువులు నిరాకరించడం ద్వారా ఖరీఫ్ సాగు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా సాగులో ఉన్న రైతులకు, కౌలు రైతులకు భూముల యజమాని ధ్రువీకరణ ఓటీపీతో ఎరువులు అం దించేలా చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి కె.మన్మథరావును ఆదేశించారు. చిన్న కాగితాపల్లి గ్రామ సచివాలయ పరిధిలో సుమారు 1200 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామని, ప్రస్తుతం 220 బస్తాల యూరియా మాత్రం వచ్చిందని, డీఏపీ కొరత ఎక్కువగా ఉన్నందున అవసరం మేరకు ఎరువులు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సాగు చేసే రైతులకు ఎరువులు ఇబ్బందులు లేకుండా అవసరం మేరకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.