పోలింగ్ సక్రమంగా జరిగేలా చూడాలి
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:37 PM
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూసుకోవాలని టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి సంబంధిత అధికారులను ఆదేశించారు.
టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి
ఎల్‌ఎన్ పేట, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూసుకోవాలని టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం లక్ష్మీనర్సుపేట గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల సామగ్రి పంపిణీని ఆర్డీవో పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో నియమనిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పోలింగ్ పూర్తయి బ్యాలెట్ బాక్స్‌లు పోలింగ్ కేంద్రం నుంచి వాహనాల్లో తీసుకువెళ్లేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈయనతోపాటు అసిస్టెంట్ ఎన్నికల అధికారి పి.శ్రీనివాసరావు, తహసీల్దార్ జె.ఈశ్వరమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
పాతపట్నంలో మోడల్ పోలింగ్ కేంద్రం పరిశీలన..
పాతపట్నం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి బుధవారం పరిశీలించారు. ఎన్నికల నిర్వాహణలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్ర పరిశీలనలో భాగంగా పోలింగ్ కేంద్రంలో మౌలిక సౌకర్యాలను పరిశీలించారు. ఎన్నికల నిర్వాహణ సమయాల్లో ఓటర్లకు ఎన్నికల నిర్వాహణ సిబ్బందికి ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా చూడాలని ఎన్నికల నిర్వాహణాధికారులను సూచించారు. అలాగే నిష్పాక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అధికారులు సమర్థవంతగా పనిచేయాలని తెలిపారు. ఈయన వెంట ఈఆర్వో-2 బి.వెంకటరమణ, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.