పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ పెంచాలి: డీఈవో
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:35 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ పెంచడానికి ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈవో ఎ.రవికుమార్ సూచించారు.
జలుమూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ పెంచడానికి ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈవో ఎ.రవికుమార్ సూచించారు. మంగళవారం మండలంలోని లింగాలవలస, చల్లవానిపేట ఉన్నతపాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ వేసవి సెలవుల్లో గ్రామాల్లో ఉపాధ్యాయులు పర్యటించి ఐదో తరగతి చదివిన విద్యార్థులను గుర్తించి ఆరో తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పదో తరగతి పరీక్షలకు పాఠశాలల్లో అమలు చేసిన వందరోజులు యాక్షన్ ప్లాన్‌పై సమీక్షించారు. అనంతరం చల్లవానిపేట ఉన్నతపాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. లింగాలవలస ఉన్నతపాఠశాలలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న బయాలజికల్ సైన్స్, ఇంగ్లీషు ఉపాధ్యాయులను డిప్యుటేషన్ ద్వారా ఎంఈవో మాధవరావు నియమిం చడంతో అభినందించారు. ఆయన వెంట ఎంఈవోలు బి.మాధవరావు, ప్రసాదరావు, హెచ్‌ఎంలు జీవీ రమణ, నిర్మలాదేవి, ఉపాధ్యాయులు ఉన్నారు.