ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి
ABN , Publish Date - May 26 , 2026 | 12:04 AM
బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఐటీడీఏ డిప్యూటీ ఈవో పి. నారాయడు సూచించారు.
ఐటీడీఏ డిప్యూటీ ఈవో నారాయడు
సీతంపేట రూరల్, మే 25(ఆంధ్రజ్యోతి): బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఐటీడీఏ డిప్యూటీ ఈవో పి. నారాయడు సూచించారు. సోమవారం కుసిమి, సంతమల్లి, దారి మల్లి, మాసడుగూడ గ్రామాల్లో అడ్మిషన్ల డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి పిల్లల వివరాలను సేకరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన పిల్లలను గుర్తించి వారిని ఒకటో తరగతిలో చేర్పిచేందుకు తల్లి దండ్రులకు అవగాహన కల్పించారు. ప్రతి బడిఈడు పిల్లాడు పాఠశాలల్లో చేరి విద్యను కొనసాగించాలని నారాయడు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో ఆనందరావు, మల్లి పాఠశాల హెచ్‌ఎం ఏవీ శ్రీనివాసరావు,ఉపాధ్యాయులు ఎం.రవి పాల్గొన్నారు.