Share News

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:42 PM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లాలోని పలుచోట్ల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.

   ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి
టెక్కలి రూరల్‌: నర్సింగపల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు :

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లాలోని పలుచోట్ల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఫ మెళియాపుట్టి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బందపల్లిలో ప్రభుత్వపాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎంఈవో పద్మనాభం మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల ల్లో చదివితే ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ బి.దినకర్‌రావు పాల్గొన్నారు.

ఫ టెక్కలి రూరల్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నర్సింగపల్లి జడ్పీ పాఠశాల విద్యార్థులు బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం గణపతిరావు, వాసుదేవరావు, ధర్మారావు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 11:42 PM