Share News

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:39 AM

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి ఊరుబడిని కాపాడుకుందామని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బాలక శంకరరావు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి
పెద్దతామరాపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

నందిగాం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి ఊరుబడిని కాపాడుకుందామని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బాలక శంకరరావు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని పెద్దతామరాపల్లిలో యూటీఎఫ్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాఠశాలలో ప్రవేశానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించగా, తొమ్మిదిమంది తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించడానికి అంగీకరించారు. ఈ సందర్భంగా ఎంఈవో-2 ఎ.చిన్నారావు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సీహెచ్‌ హైమావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 12:39 AM