Share News

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

ABN , Publish Date - May 06 , 2026 | 11:47 PM

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా విద్యా శాఖ అధికారి ఎ.రవిబాబు కోరారు. ఈ మేరకు బుధ వారం గూడెం గ్రామంలో ‘బడి పిలుస్తోంది’ కార్యక్ర మం నిర్వహించారు.

 పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి
విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కలిగిస్తున్న డీఈవో రవిబాబు

డీఈవో రవిబాబు

శ్రీకాకుళం రూరల్‌, మే 6(ఆంధ్రజ్యోతి): పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా విద్యా శాఖ అధికారి ఎ.రవిబాబు కోరారు. ఈ మేరకు బుధ వారం గూడెం గ్రామంలో ‘బడి పిలుస్తోంది’ కార్యక్ర మం నిర్వహించారు. సమ గ్రశిక్షా ఏపీసీ పి.వేణు గోపాలరావుతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పై ప్రభుత్వం దృష్టి సారిందని, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తుట్లు పేర్కొ న్నారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిం చేందుకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నా మని, దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో అధికారు లు, ఉపాధ్యాయులు పర్యటిస్తున్నార న్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆధునిక భోధన, అధునాతన సామగ్రి, అర్హత కలిగిన ఉపాధ్యాయులున్నారన్నారు. అలాగే విద్యార్థిమిత్ర ద్వారా ఉచితంగా కిట్లను పంపిణీ చేయడంతో పాటు మధ్యాహ్న భోజనంలో పౌష్ఠి కాహారం అందిస్తున్నామన్నారు. తల్లిదం డ్రులు వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి పాఠ శాలలను బలోపేతం చేయాలని కోరారు. గ్రామంలో 22 మంది విద్యార్థులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శార్వాణి, డిప్యూటీ డీఈ వో విజయకుమారి, పాఠశాల కమిటీ అధ్య క్షుడు కె.ఎర్రయ్య, ఎంఈవోలు నత్తల కృష్ణారావు, పెంకి సుజాత, సీఎంవో బి.శ్రీధర్‌, ఏఎంవో సుధా కర్‌, ఉపాఽధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 11:47 PM