Share News

వంశధార కాలువ కబ్జా

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:47 PM

Vamsadhara Canal.. Encroachment వంశధార కాలువనూ అక్రమార్కులు వదలడం లేదు. నరసన్నపేటలోని జమ్ముజంక్షన్‌ సమీపంలో పాపయ్య చెరువుకు ఆనుకొని ఉన్న 11 ఆర్‌ కిళ్లాం కాలువ గట్టుపై అక్రమ నిర్మాణం చేపట్టారు.

వంశధార కాలువ కబ్జా
వంశధార నగర్‌ కాలనీలో 11ఆర్‌ కిళ్లాం కాలువపై అక్రమ నిర్మాణం

ఒకవైపు ఆక్రమణ.. మరోవైపు నిర్మాణాలు

నరసన్నపేట, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): వంశధార కాలువనూ అక్రమార్కులు వదలడం లేదు. నరసన్నపేటలోని జమ్ముజంక్షన్‌ సమీపంలో పాపయ్య చెరువుకు ఆనుకొని ఉన్న 11 ఆర్‌ కిళ్లాం కాలువ గట్టుపై అక్రమ నిర్మాణం చేపట్టారు. స్థానిక మత్సకారులకు చేపల పెంపకం కోసం ఈ పాపయ్యచెరువు ను కేటాయించారు. చెరువు అభివృద్ధి పేరుతో పక్కనే ఉన్న 11 ఆర్‌ కిళ్లాం కాలువ గట్టును ఆక్రమించి చెరువులో కలిపేశారు. మరోవైపు కాలువ గట్టును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలకు ఎటువంటి ఎన్‌వోసీ లేకుండా విద్యుత్‌ కనెక్షన్‌ కూడా అధికారులు ఇవ్వడం గమనార్హం. ఏడాదిగా ఈ చెరువుపై ఆక్రమణదారుల కన్ను పడింది. వేసవిలో మట్టిని తరలించగా.. తాజాగా గట్టుచప్పుడు కాకుండా నిర్మాణాలు చేపట్టారు. అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వంశధార కాలువపై నిర్మాణాలు చేపట్టినట్లు తమ దృష్టికి రాలేదని, పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఈఈ మురళీమోహన్‌రావు తెలిపారు.

Updated Date - Jun 23 , 2026 | 11:47 PM