కొండ కాలువ కబ్జా
ABN , Publish Date - Jul 30 , 2026 | 01:12 AM
పలాస మండలం సుబ్బుగుడ్డి గ్రామంలో కొండ పోరంబోకు కాలువ ఆక్రమణకు గురైంది. ఈ కొండపై నుంచి వచ్చే వర్షంనీరు కిందకు ప్రవహిస్తూ ఎర్రచెరువులో క లుస్తుంది.
పొలంగా మార్చిన ఆక్రమణదారులు
చెరువుకు నీరు వెళ్లకుండా అడ్డుకట్ట
పలాసరూరల్, జూలై 29(ఆంధ్రజ్యోతి): పలాస మండలం సుబ్బుగుడ్డి గ్రామంలో కొండ పోరంబోకు కాలువ ఆక్రమణకు గురైంది. ఈ కొండపై నుంచి వచ్చే వర్షంనీరు కిందకు ప్రవహిస్తూ ఎర్రచెరువులో క లుస్తుంది. ఇక్కడి నుంచి నీరు పొలాలకు వెళ్తుంది. ఈ కారణం గా పరిసరాల్లో భూ గర్భజలాలు కూడా స మృద్ధిగా ఉన్నాయి. ఈ చెరువు మనుషులకే కా కుండా జంతువుల దాహా ర్తిని కూడా తీరుస్తోంది. ఇటీవల కొందరు వ్యక్తులు కొండ కాలువను మట్టితో పూడ్చి పైభాగంలో షెడ్లు నిర్మించారు. కొండపై నుంచి వచ్చే వర్షపు నీరు చెరువులోకి వెళ్లకుండా చేశారు. దీనివల్ల ఎర్రచెరువుకు నీరు రాకపోతే తమ మనుగడకే ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు కొండకాలువ కప్పుతున్న వారిపై చర్యలు చేపట్టాలని, ఆక్రమణలను తొలగించాలని వారు కోరుతున్నారు. తహసీల్దార్ శ్రీదేవిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని, గ్రామానికి వెళ్లి పరిశీలించి న్యాయం చేస్తామని తెలిపారు.