నేతన్న ప్రతిభకు ప్రోత్సాహకం
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:44 PM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖచిత్రంతో కూడిన ప్రత్యేక వస్త్రాన్ని మగ్గంపై నేసిన చేనేత కుటుంబానికి చెందిన బాసిన నాగేశ్వరరావు దంపతులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అభినందించారు.
లావేరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖచిత్రంతో కూడిన ప్రత్యేక వస్త్రాన్ని మగ్గంపై నేసిన చేనేత కుటుంబానికి చెందిన బాసిన నాగేశ్వరరావు దంపతులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అభినందించారు. శనివారం లావేరులోని అతని స్వగృహానికి వెళ్లి ప్రభుత్వ ప్రోత్సాహకంగా రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులు కలెక్టర్‌ను కలిశారు. కేవలం మగ్గం ఉన్నవారికే ప్రభుత్వ ప్రోత్సాహకం కింద ఏటా రూ.25 వేలు అందిస్తున్నారని, దానికి అనుబంధంగా ఉన్న కార్మికులకు కూడా ప్రోత్సాహకం అందించాలని కలెక్టర్‌ను కోరారు. ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ.. లావేరు చేనేత సొసైటీలో 160 మంది వరకు నేతన్న నేస్తం పథకం కింద లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో చేనేత కార్మికులు వెయ్యి వరకు ఉన్నారని, వీరందరి వృత్తికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక పనులు చేపట్టాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జీఎల్‌ఈ శ్రీనివాసరావు, ఆర్‌ఎస్ డీటీ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నిడిగంట్ల పద్మ, కూటమి నాయకులు కలిశెట్టి సూర్యనారా యణ, లంక నారాయణరావు, ఆరెళ్ల కృష్ణ, ముప్పిడి మురళీ మోహన్, ఎల్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.