కళాకారులకు ప్రోత్సాహం
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:02 AM
కళాకారులను జిల్లా యం త్రాంగం ప్రోత్సహిస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నా రు.
శ్రీకాకుళం కల్చరల్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కళాకారులను జిల్లా యం త్రాంగం ప్రోత్సహిస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నా రు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్, లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థల ఆధ్వర్యంలో సోమవారం బాపూజీ కళామందిర్‌లో ‘స్వర వంశధార’ సంగీతవిభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమా న్ని ప్రారంభించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్ మాట్లాడు తూ.. వంశధార పేరుతో స్వర వంశధార సంగీత విభావరి నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం పలువురు కళాకారులు గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ జిల్లా అధ్యక్షుడు నటుకుల మోహన్, క్లబ్ జిల్లా చైర్మన్ పొన్నాడ రవికుమార్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పైడి సింధూర, విభావరి నిర్వాహకుడు బగాది కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.