Share News

సముద్రపు నాచు సాగుతో ఉపాధి

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:11 AM

సముద్ర నాచు సాగు, ఉత్ప త్తులతో మత్స్యకార మహిళలకు మెరుగైన ఉపాధి లభిస్తుందని జిల్లా మత్స్యశాఖ డీడీ వై.సత్యనారాయణ అన్నారు.

సముద్రపు నాచు సాగుతో ఉపాధి
సాగు చేసిన సముద్ర నాచును పరిశీలిస్తున్న మత్స్యశాఖ డీడీ సత్యనారాయణ తదితరులు

ఎచ్చెర్ల, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): సముద్ర నాచు సాగు, ఉత్ప త్తులతో మత్స్యకార మహిళలకు మెరుగైన ఉపాధి లభిస్తుందని జిల్లా మత్స్యశాఖ డీడీ వై.సత్యనారాయణ అన్నారు. బుడగట్లపాలెం తీరం లో అమృత విశ్వవిద్యాలయం (తమిళనాడు) ఆధ్వర్యంలో నీలామృతం మహిళా ప్రగతి పథంలో భాగంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. సముద్రపు నాచును సాగును జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేస్తున్నామన్నారు. దీని ఉత్పత్తి గణనీయంగా విస్తరించనున్నట్టు చెప్పా రు. స్వయంశక్తి సంఘాలకు సముద్ర నాచు ఆధారిత ఉత్పత్తుల తయా రీ విధానాన్ని అమృత యూనివర్సిటీకి చెందిన రీసోర్స్‌పర్సన్స్‌ గౌరి, శ్వేత, జిత్తు, కృష్ణ వివరించారు. సీఎంఎఫ్‌ఆర్‌ఐడీ సైంటిస్ట్‌ జోయ్‌ నిర్వహణ పద్ధతులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, మత్స్యశాఖ ఏడీ గోపీకృష్ణ, సర్పంచ్‌ అల్లుపల్లి రాంబాబు, ఎఫ్‌డీవో రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:11 AM