Share News

‘గిగ్‌ కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలి’

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:22 AM

దేశంలో లక్షలాది మంది గిగ్‌ కార్మికులతో వెట్టిచాకిరీ చేస్తున్నారని, వారికి ఉపా ధి భద్రత కల్పించాలని ఇఫ్టూ జాతీయ ఉపా ధ్యక్షుడు పి.ప్రసాద్‌ అన్నారు.

‘గిగ్‌ కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలి’
మాట్లాడుతున్న ఇప్టూ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రసాద్‌

పాత శ్రీకాకుళం అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): దేశంలో లక్షలాది మంది గిగ్‌ కార్మికులతో వెట్టిచాకిరీ చేస్తున్నారని, వారికి ఉపా ధి భద్రత కల్పించాలని ఇఫ్టూ జాతీయ ఉపా ధ్యక్షుడు పి.ప్రసాద్‌ అన్నారు. చాపురం గ్రామంలో మూడురోజుల భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. పెద్ద కార్పొరేట్‌ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌, ఓలా, ఊబర్‌, రాపిడో జమోటో, స్విగ్గీ వంటి సంసలు లక్షలాది కార్మి కుల కష్టార్జితాన్ని కనీస ప్రతిఫలం లేకుండా దోచుకుంటున్నాయని ఆరోపించారు. గిగ్‌ కార్మి కుల రక్షణకు రాజస్థాన్‌, కర్ణాటక, బీహార్‌ చట్టాలు చేయగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వీరి కోసం చట్టం చేశారన్నారు. ఈ తరహా చట్టాలను ఇతర రాష్ట్రా ల్లోనూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఇప్టూ రాష్ట్ర అధ్యక్షుడు కె.పోలారి, ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వర్లు, ప్రతినిధులు మామిడి క్రాంతి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2026 | 12:22 AM