Share News

చేనేత క్లస్టర్‌తో ఉపాధి అవకాశాలు

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:56 PM

చేనేత క్లస్టర్‌ ఏర్పాటుతో చేనేత కార్మికులకు ఉపాధితోపాటు ఎంతోమందికి శాశ్వత ఉద్యోగాలు లభిస్తాయని క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ సెంట్రల్‌ కమిటీ సభ్యులు మీనా అపనేందర్‌, గౌరంగ్‌ షా తెలిపారు.

చేనేత క్లస్టర్‌తో ఉపాధి అవకాశాలు
స్థలాన్ని పరిశీలిస్తున్న సెంట్రల్‌ కమిటీ సభ్యులు :

పొందూరు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): చేనేత క్లస్టర్‌ ఏర్పాటుతో చేనేత కార్మికులకు ఉపాధితోపాటు ఎంతోమందికి శాశ్వత ఉద్యోగాలు లభిస్తాయని క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ సెంట్రల్‌ కమిటీ సభ్యులు మీనా అపనేందర్‌, గౌరంగ్‌ షా తెలిపారు. బుధవారం పొందూరులో చేనేత క్లస్టర్‌ ఏర్పాటుకోసం కేటాయించిన 311 సర్వేనంబరులో భూములను పరిశీలిం చారు. ఈసందర్భంగా క్లస్టర్‌ ఏర్పాటుతో చేనేతకార్మికులు నేసే వస్త్రాలకు మార్కెట్‌ పెరుగుతుందని, తద్వారా మెరుగైన ఉపాధి దొరుకుతుందని గౌరంగ్‌ షా తెలిపా రు. వీరితో పాటుతహసీల్దార్‌ వెంకటేష్‌, ఈవో జగదీష్‌ ఉన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 11:56 PM