Share News

కొబ్బరి పీచు పరిశ్రమతో మహిళలకు ఉపాధి

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:32 PM

దేశంలో కొబ్బరి పీచు పరిశ్రమతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని కోయర్‌ బోర్డు ప్రాంతీయ అధికారి (రాజమండ్రి) శిబూ లాల్‌ అన్నారు.

కొబ్బరి పీచు పరిశ్రమతో మహిళలకు ఉపాధి
మాట్లాడుతున్న కోయర్‌ బోర్డు ప్రాంతీయ అధికారి శిబూలాల్‌

లావేరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): దేశంలో కొబ్బరి పీచు పరిశ్రమతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని కోయర్‌ బోర్డు ప్రాంతీయ అధికారి (రాజమండ్రి) శిబూ లాల్‌ అన్నారు. మంగళవారం లావేరులోని శ్రీ లక్ష్మి కోయర్‌ వెల్ఫేర్‌ సొసైటీ సొసైటీ ఆధ్వ ర్యంలో కొబ్బరి పీచు పరిశ్రమపై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పీఎంఈజీపీ పఽథకం కింద రుణ సదు పాయాన్ని కల్పిస్తోందన్నారు. గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళ లకు 35 శాతం, ఇతరులకు 25 శాతం రాయితీ అందిస్తోం దని చెప్పారు. రాష్ట్రంలో 1000 వరకు కోయర్‌ బోర్డు ద్వారా కొబ్బరి పీచు పరిశ్రమలున్నాయని చెప్పారు. కొబ్బరి పీచుతో తయారు చేసిన 3,800 కొబ్బరి ఉత్పత్తులు ఏటా 121 దేశాలకు ఎగుమతులు అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఏవో డి.మహేష్‌ నాయుడు, ఏపీ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ నాగరాజు, ఏఈవో బగాది ప్రమీల, పరిశ్రమ అధ్యక్షుడు ఇనపకుర్తి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:32 PM