జాబ్‌క్యాలెండర్‌తో నిరుద్యోగ యువతకు ఉపాధి
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:33 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌తో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరు గుపడతాయని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
పాతపట్నం/ రూరల్, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌తో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరు గుపడతాయని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తుందన్నారు. ముఖ్యంగా మంత్రి లోకేశ్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఉపాధి అవకాశాలు కల్పిం చేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఇచ్చిన మా ట నిలబెట్టుకున్నారన్నారు. రాబోయే 20ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా ముఖ్య మంత్రి చంద్రబాబు కార్యాచరణ చేపట్టినట్లు వెళ్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్, పారిశ్రామికాభి వృద్ధి ద్వారా యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్య, పా రిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు పెంపుతో యు వతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు పెరుగుతు న్నాయని వివరించారు. ఆయనతో పాటు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌కుమార్ పాణిగ్రహి, కూటమి నాయకులు తదితరులు ఉన్నారు.