Share News

ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:43 PM

ఉద్యోగుల సంక్షేమానికి కూటమిప్రభుత్వం ప్రాధాన్యంఇస్తోందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరుద్యోగుల సంక్షేమానికి ప్రభు త్వం అండగా ఉంటుందని చెప్పారు.

ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం
మాట్లాడుతున్న శిరీష :

పలాస, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సంక్షేమానికి కూటమిప్రభుత్వం ప్రాధాన్యంఇస్తోందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరుద్యోగుల సంక్షేమానికి ప్రభు త్వం అండగా ఉంటుందని చెప్పారు. ఆదివారం పలాసలో విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేని విధంగా చరిత్రలోనే మొదటిసారిగా అంగన్‌వాడీలకు రెండుసార్లు వేతనం పెంచినట్లు తెలిపారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీ కేంద్రా లకు మౌలికసదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టామన్నారు. 58,204 మంది అంగన్‌వాడీ వర్కర్లు, సూపర్‌వైజర్లు, బ్లాక్‌ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్లతో 5జి ఫోన్లు అందించామని తెలిపారు. గ్రాట్యూటీ చెల్లింపుల కోసంబడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి టీవీ, టాయిలెట్‌, ఉపాధ్యాయులు, ఆయాలకు వేసవిలో 15 రోజుల సెలవులు, పాఠాలు చెప్పడానికి వీలుగా చార్టులు, ఇండక్షన్‌ స్టవ్‌లు, నాణ్యమైన వంటపాత్రలు అందించామన్నారు. మినీక్రేంద్రాలను పూర్తిస్థాయి అంగన్‌వాడీకేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేశామని, వారుప్రతిపాదించిన తొమ్మిది డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించామని తెలిపారు.

‘కూటమితోనే దివ్యాంగులకు న్యాయం’

జలుమూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) కూటమి ప్రభుత్వంతోనే దివ్యాంగులకు న్యాయం జరిగిందని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు గురుబెల్లి రమణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలతో పాటు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం పట్ల హర్షం వ్యక్తంచేశారు.

Updated Date - Mar 01 , 2026 | 11:43 PM