Share News

ఫిన్లాండ్‌లో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:28 AM

ఫిన్లాండ్‌ దేశంలో ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఉత్తమ ఉపా ధ్యాయిని తిమ్మరాజు నీరజాకుమారి అన్నారు.

ఫిన్లాండ్‌లో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం
తుర్క్‌ యూనివర్సిటీ ప్రతినిధుల నుంచి ప్రశంసాపత్రం అందుకుంటున్న నీరజాకుమారి, చిత్రంలో విద్యాశాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా

ప్రపంచ స్థాయి బోధనా పద్ధతులపై అధ్యయనం

సీఎం, విద్యాశాఖామంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నీరజ

శ్రీకాకుళం కల్చరల్‌, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ఫిన్లాండ్‌ దేశంలో ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఉత్తమ ఉపా ధ్యాయిని తిమ్మరాజు నీరజాకుమారి అన్నారు. నగరంలోని వరం హైస్కూల్‌లో హిందీ ఉపా ధ్యాయురాలిగా పని చేస్తున్న చెందిన తిమ్మరాజు నీరజ ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రంలోని 29 మంది ఉత్తమ ఉపాధ్యా య అవార్డు గ్రహీతలతో కలిసి ఫిన్లాండ్‌ దేశం తుర్క్‌ యూనివర్సిటీలో అధ్యయనం చేశారు. ఆదివారం ఆమె శ్రీకాకుళం చేరుకున్నారు. ఈ సంద ర్భంగా అక్కడి అధ్యయన అనుభవాలను మీడియాకు వివరించారు. తుర్క్‌ యూనివర్సిటీలో నిర్వహించిన ఎక్స్పో జర్‌ విజిట్‌లో జాయ్‌ అండ్‌ ప్లే వంటి వినూత్న పద్ధతుల ద్వారా పూర్వ ప్రాథమిక, ప్రాథమికస్థాయి విద్యలో వృత్తిపర మైన శిక్షణ ఇవ్వడం కరికులంలో సంస్కరణలను అధ్యయ నం చేసినట్లు వివరించారు. విద్యార్థులకు విద్యా బోధనలో అక్కడ ఇస్తున్న వినూత్న పద్ధతులను పరిశీలించి నట్లు తెలిపారు. తుర్క్‌లోని ఒకేషనల్‌ టైనింగ్‌ సెంటర్‌ను, అక్కడి రౌమాలోని ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాన్ని పరిశీలించామని ఆమె పేర్కొన్నారు.

తుర్క్‌ వర్సిటీ నుంచి నీరజకు ప్రశంస

రెండు దశల్లో శిక్షణాధ్యయనాన్ని పూర్తి చేసినందుకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా, తుర్క్‌ యూని వర్సిటీ అంతర్జాతీయ విద్యాభివృద్ధి ప్రతినిధులు సింజాయ్‌, సారిఐసో క్యూటో సువిపుఓలక్క చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నట్లు నీరజాకుమారి తెలిపారు. ఈ గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖామంత్రి నారా లోకేష్‌కు ఆమె కృత జ్ఞతలు తెలిపారు,

Updated Date - Aug 31 , 2026 | 12:28 AM