Share News

జవానుకు కన్నీటి వీడ్కోలు

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:15 AM

అమర్‌నాఽథ్‌లో మృతిచెందిన పోలాకి మండలం విశ్వేశ్వరనగర్‌ కాలనీకి చెందిన జవాను సిద్దాంతం కిరణ్‌కుమార్‌(35) అంత్యక్రియలను శనివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. అమరనాఽథ్‌ నుంచి ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని కార్యాలయ సిబ్బంది తీసుకువచ్చారు.

 జవానుకు కన్నీటి వీడ్కోలు
కిరణ్‌కుమార్‌ మృతదేహం వద్ద గౌరవ వందనం చేస్తున్న ఎస్‌ఐ రంజిత్‌

పోలాకి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అమర్‌నాఽథ్‌లో మృతిచెందిన పోలాకి మండలం విశ్వేశ్వరనగర్‌ కాలనీకి చెందిన జవాను సిద్దాంతం కిరణ్‌కుమార్‌(35) అంత్యక్రియలను శనివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. అమరనాఽథ్‌ నుంచి ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని కార్యాలయ సిబ్బంది తీసుకువచ్చారు. అభిమానులు, బంధుమిత్రులు జాతీయ జెండాలతో అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఐటీబీపీ నుంచి వచ్చిన ప్రత్యేకాధికారి అన్‌కిత్‌కుమార్‌ఽధైయాగి, పోలాకి ఎస్‌ఐ రంజితకుమార్‌లు కిరణ్‌ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పోలాకి నుండి వచ్చిన పోలీసులు గాలిలో కాల్పుల జరిపారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతుడి భార్య శిరీషకు ఉపాఽధి కల్పించాలని స్థానిక యువజన నాయకులు యాబాజి రాము, సంతోష్‌, శంకర్‌ అమరనాఽథ్‌ నుంచి వచ్చిన ప్రత్యేకాధికారిని కోరారు.

Updated Date - Sep 27 , 2026 | 12:15 AM