Share News

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోండి

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:58 PM

ప్రస్తుతం వస్తున్న అనేక ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చు కోవాలని, తద్వారా ఆయా రంగాల్లో పురోభివృద్ధి సాధిం చాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. ఈ మేరకు పొందూరులో ఏర్పాటు చేయనున్న చేనేత, ఖాదీ క్లస్టర్‌లో భాగంగా సాయిబాబా చేనేత సహకార సంఘం ప్రాంగణం లోని కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌లో బుధవారం మహిళలకు చేనేతలో శిక్షణ కార్యక్రమం ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో కలిసి ప్రారంభించారు.

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోండి
శిక్షణా శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ఎమ్మెల్యే రవికుమార్‌తో కలిసి చేనేత శిక్షణ ప్రారంభం

పొందూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం వస్తున్న అనేక ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చు కోవాలని, తద్వారా ఆయా రంగాల్లో పురోభివృద్ధి సాధిం చాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. ఈ మేరకు పొందూరులో ఏర్పాటు చేయనున్న చేనేత, ఖాదీ క్లస్టర్‌లో భాగంగా సాయిబాబా చేనేత సహకార సంఘం ప్రాంగణం లోని కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌లో బుధవారం మహిళలకు చేనేతలో శిక్షణ కార్యక్రమం ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశలో వ్యాపారాలు లేదా స్టార్టప్‌లను ప్రారంభించాలని కోరారు. ఎమ్మెల్యే రవి కుమార్‌ మాట్లాడుతూ.. పొందూరులో నైపుణ్యం ఉన్న చేనేత కళాకారులుండి మంచి వస్త్రాలు నేస్తున్నప్పటికీ తగిన గుర్తింపు రావడం లేదని ఆవదన వ్యక్తం చేశారు. పొందూరులో చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు క్లస్టర్‌ ఏర్పాటుచేయాలని తన కల అని, దీనిని కలెక్టర్‌ సహకారంతో సాధించగలిగానని చెప్పా రు. నేత శిక్షణలో చేనేత సామాజికవర్గంతోపాటు ఆసక్తి ఉన్న ఎవరైనా శిక్షణ పొందవచ్చని చెప్పారు. కార్య క్రమంలో డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, తహసీల్దార్‌ ఆర్‌.వెంకటేష్‌, ఎంపీడీవో వాసుదేవరావు, చేనేత జౌళి శాఖ ఏడీ జనార్దనరావు, క్లస్టర్‌ ఇన్‌చార్జి మేరీ, మేనేజర్‌ మార్టిన్‌, టీడీపీ నేతలు రామ్మోహన్‌, అన్నెపు రాము, చినరంగ, నాయకులు ఏపీఎంలు శ్యామలరావు, రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

పల్లెపండగతో సమగ్రాభివృద్ధి

పొందూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కూటమి అమలు చేస్తున్న పల్లెపండగ 3.0తో పల్లెల్లో సమగ్రాభి వృద్ధి జరుగుతుందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే రవికుమార్‌ అన్నారు. పల్లెపండగలో భాగంగా చేనేత సహకార సంఘం ప్రాంగణంలో బుధవారం రూప్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్‌ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.

‘రూ.200 కోట్లతో అభివృద్ధి’

ఆమదాలవలస, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమదాలవలస మునిసిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేప ట్టేందుకు రూ.200 కోట్లు మంజూరయ్యాయని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. బుధవారం పట్టణంలోని రెండు, పదో వార్డుల్లో వివిధ నిర్మాణాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. కార్య క్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌, రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్‌, మునిసిపల్‌ మాజీచైర్‌పర్సన్‌ తమ్మినేని గీత, రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ టి.చంద్రశేఖర్‌, పలువురు నేతలు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 11:58 PM