పరీక్షలపై భయం పోగొట్టండి
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:16 AM
పరీక్షలంటే భయం పోయేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ ఉపాధ్యాయులకు సూచించారు.
కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్
విద్యార్థుల సామర్థ్యం పరిశీలన
నరసన్నపేట, జనవరి 3(ఆంఽధ్రజ్యోతి): పరీక్షలంటే భయం పోయేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం కంబకాయి ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. గణితం, ఇంగ్లిషు, సైన్స్ సబ్జెక్టులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు రాసే విధానం పై ఉపాధ్యాయులు మరింత తర్ఫీదు ఇవ్వాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరీక్షలు రాసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థుల నోట్ పుస్తకాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్.సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పోగోటి ఉమామహేశ్వరి, పాగోటి అప్పలనాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.