ఫర్నీచర్ షాప్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:04 AM
నగరంలోని గొంటివీధిలో ఉన్న పవన్‌సాయి ఎంటర్ ప్రైజెస్ ప్లేవుడ్, ఫర్నీచర్ దుకాణంలో గురు వారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి.
రూ.1.50 లక్షల విలువైన సామగ్రి దగ్ధం
శ్రీకాకుళం క్రైం, మార్చి 27(ఆంధ్ర జ్యోతి): నగరంలోని గొంటివీధిలో ఉన్న పవన్‌సాయి ఎంటర్ ప్రైజెస్ ప్లేవుడ్, ఫర్నీచర్ దుకాణంలో గురు వారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఫర్నీచర్ దుకాణంలో మంటలు రావడంతో స్థానికులు గమనించి వెంటనే యజమాని దుర్గా విజయ్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చేసరికే మంటలు తీవ్రం కావడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఏడీఎఫ్‌వో శ్రీనుబాబు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే రూ.1.50 లక్షల విలువైన కంప్యూటర్, డ్రస్సింగ్ టేబుల్ తయారుచేసే మెటీరియల్, రివాల్వింగ్ కుర్చీలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేయడంతో మరో సుమారు రూ.8.50 లక్షల విలువైన ఫర్నిచర్ కాలిపోకుండా మిగిలాయి.