ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:44 PM
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం ఆర్డీవో ఎం.లావణ్య అన్నారు.
- సకాలంలో పోలింగ్ కేంద్రాలకు సామగ్రి చేరాలి
- శ్రీకాకుళం ఆర్డీవో లావణ్య
జి.సిగడాం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం ఆర్డీవో ఎం.లావణ్య అన్నారు. జి.సిగడాంలోని ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఆమె శనివారం పరిశీలించారు. సకాలంలో పోలింగ్ కేంద్రాలకు సామగ్రి చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీవో జి.రామకృష్ణారావు, ఆర్‌ఐ రాధ, ప్రిన్సిపాల్ గణేష్ పట్నాయక్, వీఆర్వో భూపతి నర్సింగరావు తదితరులు ఉన్నారు.
నేటినుంచి నామినేషన్ల స్వీకరణ
సోంపేట, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల కోసం నాలుగు కేంద్రాలను సిద్ధం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో సోంపేట, రుషికుద్ద, ఇస్కలపాలెం, పలాసపురం మండల పరిషత్ పాఠశాలలో బెంకిలి, జింకిభద్ర, పలాసపురం, బారువ జూనియర్ కళాశాలలో బారువ, గొల్లగండి, కొర్లాం సచివాలయంలో కొర్లాం, బీఆర్‌సీపురం, పాలవలస జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో పాలవలస, టి.శాసనాం, పొత్రకండ, కర్తలిపాలెం, సుంకిడి సచివాలయంలో సుంకిడి, బుషాభద్ర, మాకన్నపురం, ఎంజీపురం, మామిడిపల్లి మండల పరిషత్ పాఠశాలలో మామిడిపల్లి, ఉప్పలాం, సిరిమామిడి, మామిడిపల్లి, తాళ్లభద్ర, గొల్లవూరు పంచాయతీ లకు చెందిన అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఇచ్ఛాపురంలో ఆరు చోట్ల..
ఇచ్ఛాపురం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని 21 పం చాయతీలకు సంబంధించి ఆదివారం నుంచి ఈ నెల 17వరకు ఆరు క్లస్టర్లలో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందని ఎంపీడీవో ప్రభాకరరావు తెలిపారు. కొళిగాం క్లస్టర్‌లో కొళిగాం, పాయి తారి, కీర్తిపురం, బొడ్డబడ, లొద్దపుట్టి క్లస్టర్‌లో లొద్దపుట్టి, టి.బరంపు రం, అరకబద్ర, తేలుకుంచి క్లస్టర్‌లో తేలుకుంచి, హరిపురం, బిర్లంగి, మశాఖపురం, మండపల్లి క్లస్టర్‌లో మండపల్లి, బాలకృష్ణాపురం, కేదారి పురం, ముచ్చింద్ర, ఈదుపురం క్లస్టర్‌లో ఈదుపురం, కేశుపురం, బూ ర్జుపాడు, ధర్మపురం క్లస్టర్‌లో ధర్మపురం, కొఠారి, తులసిగాం పంచా యతీల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు చెప్పారు. 21న నామినేషన్ల ఉపసంహరణ, 26న పోలింగ్.. అదేరోజు ఫలితాలు కూడా వెల్లడవుతాయని తెలిపారు. 21 పంచాయతీల్లో 47,878 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో మహిళలు 24,706 మంది, పురుషులు 23,168మంది, ఇతరులు నలుగురు అని తెలిపారు.
రిజర్వేషన్‌లు ఇలా..
టి.బరంపురం (ఎస్సీ జనరల్), అరకభద్ర, బొడ్డబడ, కేదారిపురం, కీర్తిపురం(బీసీ మహిళా), బూర్జపాడు, ఈదుపురం, కేసుపురం, కొళిగాం లొద్దపుట్టి, తేలుకుంచి (అన్ రిజర్వ్‌డ్), బాలకృష్ణాపురం, హరిపురం, కొఠారి, మశాఖపురం, ముచ్చింద్ర (బీసీ జనరల్), బిర్లంగి, ధర్మపురం, మండపల్లి, పాయితారి, తులసిగాం (అన్ రిజర్వ్‌డ్).
144 సెక్షన్ అమలు...
నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు 30 పోలీస్ యాక్ట్, ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని సీఐ మీసాల చిన్నమనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్ కేంద్రానికి 100మీటర్ల దూరంలో ర్యాలీలు ఆగిపోవాలని అన్నారు.
నామినేషన్ కేంద్రాల పరిశీలన
పొందూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను శనివారం ఎంపీడీవో వాసుదేవరావు, ఈవోఆర్‌డీ పి.సింహాచలం, డిప్యూటీ ఎంపీడీవో డి.అప్పన్న పరిశీలించారు. మండలంలోని 29 పంచాయతీలకు సంబంధించి పిల్లలవలస, పెనుబర్తి, కింతలి, పొందూరు, తాడివలస, లోలుగులో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండో దశలో జరగనున్న ఎన్నికల కోసం ఈ నెల 17 నుంచి అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించనున్నారు.
ప్రజలు సహకరించాలి: డీఎస్పీ
శ్రీకాకుళం క్రైం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ఎన్ని కలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ ధనుంజయనాయుడు కోరారు. పాత్రునివలస గ్రామంలో డీఎస్పీ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలతో సమావేశమై నగరపాలక సంస్థ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని, ఎలాంటి గొడవలు పడకూ డదన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించా లన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ వద్దన్నారు. పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ఈ కార్య క్రమంలో రూరల్ సీఐ వై.రామకృష్ణ, ఎస్‌ఐ సురేష్ పాల్గొన్నారు.