Share News

ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి: సీఐ

ABN , Publish Date - Sep 20 , 2026 | 11:44 PM

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాం తంగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నేతలు, యువత కృషిచేయాలని సీఐ ఎం.తిరుపతి కోరారు. మండలంలోని బాలిగాం గ్రామంలో పల్లెనిద్ర కార్య క్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అన్ని రకాల పార్టీల నేతలు, యువత, మహిళలతో సమావేశం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌, టీడీపీ మండలాధ్యక్షుడు బావన దుర్యోధన పాల్గొన్నారు.

 ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి: సీఐ
పాతపట్నం: సరాళిలో మాట్లాడుతున్న వెంకటరావు

మందస, సెప్టెంబరు20(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాం తంగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నేతలు, యువత కృషిచేయాలని సీఐ ఎం.తిరుపతి కోరారు. మండలంలోని బాలిగాం గ్రామంలో పల్లెనిద్ర కార్య క్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అన్ని రకాల పార్టీల నేతలు, యువత, మహిళలతో సమావేశం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌, టీడీపీ మండలాధ్యక్షుడు బావన దుర్యోధన పాల్గొన్నారు.

‘డీజేల శబ్దాల నియంత్రణలో సహకరించాలి’

పాతపట్నం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): డీజే శబ్దాల నియంత్రణలో సహకరించాలని సీఐ కె.వెంకటరావు తెలిపారు. ఆదివారం మండలంలోని సరాళిలో సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లా డుతూ ప్రాణాపాయకర అనుభవాలు ఎదురవుతున్న నేపథ్యంలో ధ్వని కాలుష్యం నివారించాలన్నారు. గ్రామాల్లో కొత్త, అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Updated Date - Sep 20 , 2026 | 11:44 PM