పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ఎన్నికలు
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:01 AM
మండల పరిషత్‌లో నిర్వహించనున్న కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారం, ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలకు సంబంధించి న ప్రక్రియను పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గౌతు శిరీష, నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్నచౌదరి నాయకులకు సూచించారు.
పలాస రూరల్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మండల పరిషత్‌లో నిర్వహించనున్న కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారం, ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలకు సంబంధించి న ప్రక్రియను పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గౌతు శిరీష, నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్నచౌదరి నాయకులకు సూచించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులతో బుధవారం వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్ల్లాడుతూ ఎన్నికల ప్రక్రియను సమన్వయంతో, బాధ్యతాయుతంగా నిర్వహించుకోవాలన్నారు. ప్రమాణ స్వీకారంపై ఎంపీటీసీ సభ్యులకు సూచనలిచ్చారు. ఈ సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు, టీడీపీ నాయకులు కుత్తుమ లక్ష్మణరావు, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.