16 ఏళ్ల తరువాత ఎన్నికలు కూటమి ఘనత
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:50 PM
శ్రీకాకుళం నగర పాలక సంస్థకు 16 ఏళ్ల తరువాత ఎన్నికలు నిర్వహిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని, వైసీపీ తప్పుడు ప్రచా రాలు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
తప్పుడు ప్రచారాలకు భయపడేది లేదు
ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం అర్బన్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగర పాలక సంస్థకు 16 ఏళ్ల తరువాత ఎన్నికలు నిర్వహిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని, వైసీపీ తప్పుడు ప్రచా రాలు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. టీడీపీ కార్యా లయంలో బుధవారం విలేకరులతో మాట్లాడు తూ.. 16 ఏళ్ల పాటు ఎన్నికలకు అడ్డుకుని ఒక కాలువ లేకున్నా, ఒక బోరు పోయినా, వీధి లైటు లేకున్నా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చే దుస్థితి కల్పించారన్నారు. ప్రజల వద్దకే కార్పొరేటర్లను చేర్చి సమస్యలు పరిష్కరించేందుకు కార్పొరేషన్ ఎన్నికలు నిర్వ హిస్తున్నామని పేర్కొన్నారు. దివంగత మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పట్ల తనకు ఎల్లప్పుడూ అపారమైన గౌరవం ఉందని స్పష్టం చేశారు. అయితే గతం లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజ కీయ వైఖరిని ఎత్తుగడలను ఉద్దేశించి తాను చేసిన విమర్శలను వక్రీకరించి వాటిని గుండ లక్ష్మీదేవికి ఆపాదిస్తూ తాను అగౌరవ పరిచినట్లు దుష్ప్రచారం చేయడం తగదన్నారు. గతం లో లక్ష్మీదేవిని మహానటి అంటూ.. సన్‌రైజ్ హోటల్‌లో అవినీతి చేసి వడ్డాణం చేయించుకుంటున్నారని దుష్ప్రచారం చేసింది ధర్మాన ప్రసాదరావు కాదా అని ప్రశ్నించారు. తాము నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, మిగిలిన పనులను పూర్తి చేస్తామన్నారు. కార్పొరేటర్ల టికెట్లు ఆశించినా పార్టీ ఆదేశాలతో త్యాగం చేసిన వారిని సముచిత రీతిలో గుర్తిస్తామని స్పష్టం చేశారు.