ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే..
ABN , Publish Date - Oct 21 , 2026 | 11:57 PM
న్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా రాజకీయ పార్టీలు నియమావళిని తప్పనిసరిగా పాటిం చాల్సిందేనని ఆర్డీవో కె.సాయిప్రత్యూష అన్నారు.
శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయి ప్రత్యూష
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా రాజకీయ పార్టీలు నియమావళిని తప్పనిసరిగా పాటిం చాల్సిందేనని ఆర్డీవో కె.సాయిప్రత్యూష అన్నారు. శ్రీకా కుళం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీ టీసీ ఎన్నికల నిర్వహణపై బుధవారం తన కార్యాల యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నామినే షన్ల స్వీకరణ మొదలుకుని గుర్తుల కేటా యింపు, ప్రచార వాహనాలు, మైక్‌ల వినియోగానికి తీసుకోవా ల్సిన ముందస్తు అనుమతులు, పరిమితికి లోబడి చే యాల్సిన ఎన్నికల వ్యయం తదితర అంశాలను వివరిం చారు. నిబంధనలకు సంబంధించిన పత్రాల ప్రతులను పార్టీల నేతలకు అందజేశారు. సమావేశంలో పీఎంజే బాబు, జ్యోతి భాస్కర్( టీడీపీ), ఐటీకుమార్ (వైసీపీ), కేవీఎల్‌ఎస్ ఈశ్వరి(కాంగ్రెస్), భూషణ్ (బీజేపీ), నరస న్నపేట, ఆమదాలవలస నియోజకవర్గాల పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.