Share News

ఆదిత్యాలయంలో సొమ్మసిల్లిన వృద్ధురాలు

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:13 AM

ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి ఆదివారం వచ్చిన పలాసకు చెందిన వృద్ధురాలు అరుణ జ్యోతి సొమ్మసిల్లి అస్వస్థతకు గురైంది. వెంటనే గమనించిన ఆలయ సిబ్బంది స్థానిక ఆర్‌ఎంపీ సాయంతో తక్షణ చికిత్స అందించగా ఆమె కోలుకుంది.

ఆదిత్యాలయంలో సొమ్మసిల్లిన వృద్ధురాలు
సొమ్మసిల్లిన వృద్ధురాలికి సపర్యలు చేస్తున్న దృశ్యం

అరసవల్లి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి ఆదివారం వచ్చిన పలాసకు చెందిన వృద్ధురాలు అరుణ జ్యోతి సొమ్మసిల్లి అస్వస్థతకు గురైంది. వెంటనే గమనించిన ఆలయ సిబ్బంది స్థానిక ఆర్‌ఎంపీ సాయంతో తక్షణ చికిత్స అందించగా ఆమె కోలుకుంది. ఎండతీవ్రత తట్టుకోలేక ఆమె సొమ్మసిల్లిపోయింది. చికిత్స అనంతరం ఆమెకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఆదివారం సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. బస్సులు, కార్లు, ఇతర వాహ నాల్లో స్వామిని దర్శించుకు నేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి అవసరమైతే వైద్యసేవలు అందించేందుకు డీఎంహెచ్‌వో కార్యాల యం నుంచి వైద్య సిబ్బంది ఉండే వారు. అయితే గత రెండు వారాలుగా వారు రావడం లేదు. గత ఆదివారం విశాఖకు చెందిన ఓ మహిళ ఇలా గే అస్వస్థతకు గురైంది. ప్రతి ఆదివారం సిబ్బందిని పంపా లని ఆలయ అధికారులు వైద్యశాఖాధికారు లను కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రతీ ఆది వారం వైద్యునితో కూడిన బృందం అత్యవసర సమయంలో సేవలం దించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Aug 03 , 2026 | 12:13 AM