Share News

పాముకాటుతో వృద్ధురాలి మృతి

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:02 AM

అక్కులపేట గ్రామానికి చెందిన బొడ్డేపల్లి సత్యవతి (60) పాము కాటుకు గురై మృతి చెందినట్టు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపారు.

పాముకాటుతో వృద్ధురాలి మృతి
సత్యవతి (ఫైల్‌), రాములమ్మ (ఫైల్‌)

ఆమదాలవలస, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): అక్కులపేట గ్రామానికి చెందిన బొడ్డేపల్లి సత్యవతి (60) పాము కాటుకు గురై మృతి చెందినట్టు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శనివారం సాయంత్రం గ్రామ శివారులోని వెంకన్న చెరువు వద్ద పొలం పనులు చేస్తుండగా పాముకాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను జొన్నవలస సీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త చిన్నప్పయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచ నామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి భర్తతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. సత్యవతి మృతితో అక్కులపేట గ్రామం లో విషాదచాయలు అలముకున్నాయి.

బాడాంలో మహిళ..

నరసన్నపేట, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): బాడాం గ్రామానికి చెందిన చల్ల రాములమ్మ (45) పాముకాటుకు గురై చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈనెల 25న రాములమ్మ ఇంట్లో పాముకాటుకు గురైంది. కుటంబ సభ్యులు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శనివారం మృతిచెందింది. రాములమ్మ బాడాం ఉన్నత పాఠశాలలో ఆయగా పని చేస్తుంది. హెచ్‌ఎం జగదీష్‌, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.

Updated Date - Oct 04 , 2026 | 12:02 AM