Share News

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:56 PM

లింగాలవలస వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన తండ్యాల సూర్యనారాయణ (88) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

జలుమూరు, మార్చి 9(ఆంధ్రజ్యోతి): లింగాలవలస వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన తండ్యాల సూర్యనారాయణ (88) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సూర్యనారాయణ బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా చల్లవానిపేట నుంచి నరసన్నపేట వైపు వస్తున్న లగేజీ ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిం చారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్యనారాయణ కుమార్తె వాన రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ రాజశేఖర్‌ తెలిపారు.

చికిత్సపొందుతూ విద్యార్థి..

ఎచ్చెర్ల, మార్చి 9(ఆంధ్రజ్యోతి): పట్టుశాలిపేటకు చెందిన యవకుడు చికిత్సపొందుతూ మృతిచెందాడు. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అరి ణాం అక్కివలస పంచాయతీ పట్టుశాలిపేటకు చెందిన అరసవల్లి కార్తీక్‌(19), అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు గండ్రేటి మధుచరణ్‌తో కలిసి ఆదివారం రాత్రి బైక్‌పై చిలకపాలెం జంక్షన్‌కు వెళ్లారు. తిరిగి సర్వీసు రోడ్డులో వస్తూ.. అల్లినగరం జంక్షన్‌ సమీపంలో టార్పాలిన్‌ కప్పి ఆరబెట్టిన మొక్కజొన్న పిక్కలపైకి ఎక్కించారు. దీంతో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న కార్తీక్‌ తల కు బలంగా గాయం కాగా, వెనుక కూర్చొన్న మధుచరణ్‌ కూడా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం తొలుత శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కార్తీక్‌ చికిత్స పొందు తూ ఆదివారం అర్ధరాత్రి మృతిచెందాడు. కాగా గాయపడిన మధుచరణ్‌ను వి శాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాజశేఖర్‌, దేవి దంప తులకు కుమార్తె వర్షిత, కుమారుడు కార్తీక్‌ ఉన్నారు. రాజశేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపారు. కాగా కార్తీక్‌ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఓ వైపు డిగ్రీ చదువుతూ, మరో వైపు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న కార్తీక్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Mar 09 , 2026 | 11:56 PM