ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడు మృతి
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:46 PM
తిర్లంగి సమీపంలో ఆదివారం ట్రాక్టర్ ఢీకొని సైన రాములు(80) మృతి చెందాడు.
టెక్కలి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): తిర్లంగి సమీపంలో ఆదివారం ట్రాక్టర్ ఢీకొని సైన రాములు(80) మృతి చెందాడు. పో లీసులు తెలిపిన వివరాల మేరకు.. అక్క వరం వైపు వెళ్లే మార్గంలో స్నానానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచే సుకుంది. గాయపడిన రాములును జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాములుకి భార్య లచ్చమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
పలాస, మార్చి 15(ఆంధ్రజ్యోతి): జాతీయరహదారి మొగిలిపాడు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మందస మండలం రాయికోల గ్రామానికి చెందిన సవర రామన్న పలాస నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన రామన్నను 108 వాహనంలో చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.