చిన్నారిపై వృద్ధుడి అఘాయిత్యం
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:43 PM
తన మనవరాలి వయసున్న పసికందుపై అఘాయిత్యానికి పాల్ప డ్డాడు ఓ వృద్ధుడు.
కోటబొమ్మాళి, సెప్టెం బరు 10 (ఆంధ్రజ్యోతి): తన మనవరాలి వయసున్న పసికందుపై అఘాయిత్యానికి పాల్ప డ్డాడు ఓ వృద్ధుడు. స్థానిక ఎస్‌ఐ వంగపండు సత్య నారాయణ గురు వారం తెలిపిన వివరాలివీ... మండలంలోని ఓ గ్రామానికి చెందిన కవిటి రామారావు (75) అనే వృద్ధుడు బుధవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఆరేళ్ల చిన్నారిని తన ఇంటి మేడపైకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ చిన్నారి ఏడుస్తుండడంతో సాయంత్రం కుటుంబ సభ్యులు ఆరా తీశారు. దీంతో విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ కె. శ్రీనివాసరావు, ఎస్‌ఐ వంగపండు సత్యనారాయణ బుధవారం సాయంత్రం కేసు నమోదు చేశారు. ఈమేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని... గురువారం స్థానిక జూనియర్ సివిల్ న్యాయాధికారి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు రామారావును స్థానిక పోలీసు స్టేషన్ నుంచి కోర్టు వరకు సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్‌ఐ వంగపండు సత్యనారాయణలు సిబ్బందితో కలిసి కాలినడకన తీసుకు వెళ్లడం గమనార్హం.