Share News

వృద్ధ దంపతులపై దాడి.. తీవ్ర గాయాలు

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:15 AM

దిమిడి జోలలో శనివారం వృద్ధ దంపతులపై దాడిచేయ డంతో తీవ్రంగా గాయప డ్డారు.

వృద్ధ దంపతులపై దాడి.. తీవ్ర గాయాలు
గాయపడిన దంపతులు రూపావతి, మన్మథరావు

నందిగాం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): దిమిడి జోలలో శనివారం వృద్ధ దంపతులపై దాడిచేయ డంతో తీవ్రంగా గాయప డ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరు.. అదే గ్రా మానికి చెందిన సలాన రూపావతి, మన్మథరావు భార్య, భర్తలు. వారితో పక్కింట్లో నివాసం ఉంటున్న గొర్లె వాసుదేవ్‌ గొడవపడ్డారు. ఈక్రమంలో వాసు దేవ్‌ కర్రతో దంపతులపై దాడిచేయడంతో తీవ్రంగా గాయ పడ్డారు. వీరిని చికిత్స నిమిత్త టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రికు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండ డంతో మెరుగైన వైద్యంకోసం శ్రీకాకుళం రిఫర్‌ చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 01 , 2026 | 12:15 AM