Share News

టెట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:34 AM

జిల్లాలో ఆదివారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించనున్న ఉపాధ్యాయుల ప్రత్యేక టెట్‌ను ప్రశాంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు.

టెట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

  • నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహణ

  • జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలు.. 4709 మంది అభ్యర్థులు

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించనున్న ఉపాధ్యాయుల ప్రత్యేక టెట్‌ను ప్రశాంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో శ్రీ శివాని ఇంజినీరింగ్‌ కళాశాల, వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల, నరసన్నపేట లోని కోర్‌ టెక్నాలజీతో పాటు ఒడిశాలో రెండు కేంద్రాలు కలిపి మొత్తం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోజుకు రెండు విడతల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా చేయాలన్నారు. జిల్లాలో 4,709 ఉపాధ్యాయులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు, ఎస్కార్ట్‌ సౌకర్యం కల్పించాలని ఆర్డీవోలు, పోలీసు అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండేలా చూడాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. అభ్యర్థుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని ఆదేశించారు.

Updated Date - Oct 11 , 2026 | 12:34 AM