Share News

బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:39 PM

మందసలోని వాసుదేవ బ్రహ్మాత్సవాలకు పోలీసు, ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కాశీబుగ్గ డీఎస్పీ షేక్‌ షేహబాజ్‌ అహ్మద్‌ ఆదేశించారు.

 బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఆలయంలో ఏర్పాట్లను పరిశీస్తున్న డీఎస్పీ షేక్‌ షేహబాజ్‌ అహ్మద్‌:

హరిపురం, ఫిబ్రవరి2 (ఆంధ్రజ్యోతి): మందసలోని వాసుదేవ బ్రహ్మాత్సవాలకు పోలీసు, ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కాశీబుగ్గ డీఎస్పీ షేక్‌ షేహబాజ్‌ అహ్మద్‌ ఆదేశించారు. సోమవారం మందస వాసుదేవ ఆల యంలో ఈనెల ఏడో తేదీ నుంచి జరిగే వాసుదేవ బ్రహ్మాత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసుస్టేషన్‌లో పోలీసు, ఆలయ అధికారులతోపాటు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్షించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ గత ఏడాది కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. భోజనాలు, మంచినీటి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.వాసుదేవుని కల్యాణోత్సవంలో భక్తులు భారీగా హాజరయ్యే అవకా శం ఉండడంతో ఆ రోజు చేపడుతున్న ప్రత్యేక ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో సేవచేసే యువకులకు ఆలయ సిబ్బంది, పోలీసులు ఎప్పటి కప్పుడు సలహాలనిచ్చి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల న్నారు.కార్యక్రమంలో సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌, ప్రధాన అర్చకులు కూర్మాచార్యులు, అభివృద్ధికమిటీ సభ్యులు మహేష్‌, దేవరశెట్టి మార్కండేయులు, ఈవో నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 11:39 PM