పట్టణాభివృద్ధికి కృషి: కేంద్ర మంత్రి రామ్మోహన్
ABN , Publish Date - Oct 26 , 2026 | 11:53 PM
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇచ్ఛాపురం పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఇచ్ఛాపురం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇచ్ఛాపురం పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఇచ్ఛాపురంలో పర్యటించి మాట్లాడారు. గత పాలకులు తాగునీటి సౌకర్యం కల్పించలేకపోయారన్నారు. ఇంటింటికీ తాగు నీరందించే చర్యలు చేపడుతున్నామన్నా రు. గతంలో టీడీపీ హయాంలో మునిసిపాలిటీలో పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి అభివృద్ధి చేశామని గుర్తుచేస్తూ.. అదే తరహాలో పట్టణంలో మౌలిక సదు పాయాల కల్ప నకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం పురుషోత్తపురంలో అమృత్ 2.0 పథకం కింద రూ.70 కోట్లతో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్, జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, పలువురు నేతలు పాల్గొన్నారు.
టీడీపీలోకి 50 మంది వైసీపీ నేతలు
కవిటి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): కవిటి మండల సొండికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాండవ రామారావు టీడీపీ తీర్థం పుచ్చు కున్నారు. రామయ్యపుట్టుగలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరి గిన కార్యక్రమంలో కవిటి మాజీ సర్పంచ్ పి.చంద్రశేఖర్‌తో పాటు 50 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్య క్షుడు పి.కృష్ణారావు, ఏఎంసీ చైర్మన్ మణిచంద్రప్రకాష్, పార్టీ జిల్లా ఉపా ధ్యక్షుడు ఎస్. వెంకటరమణ, పలువురు నేతలు పాల్గొన్నారు.