ప్రధాని మోదీ సభ విజయవంతానికి కృషి
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:02 AM
ఉత్తరాంధ్ర అభివృద్ధే ధ్యేయంగా భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సభ ను విజయంతం చేయాలని మంత్రి జనార్ధన రెడ్డి సూ చించారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్ క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహిం చారు.
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
రణస్థలం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర అభివృద్ధే ధ్యేయంగా భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సభ ను విజయంతం చేయాలని మంత్రి జనార్ధన రెడ్డి సూ చించారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్ క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి వస్తున్న పీఎం సభకు ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి సుమారు 25 వేల మందిని తీసుకొచ్చేలా కూటమి నాయకులు బాధ్యత వహించాలన్నారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సత్క రించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లంక శ్యామల రావు, ముప్పిడి సురేష్, బెండు మల్లేశ్వరరావు, కొమరాపు రవి, డీజీఎం ఆనందరావు, పిషని జగన్నాథం నాయుడు, కలిశెట్టి సూర్యనారాయణ పాల్గొన్నారు.
‘భోగాపురం సభను విజయవంతం చేద్దాం’
జి.సిగడాం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానా శ్రయం ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని కాళింగ కార్పొరేషన్ చైర్మన్, మండల పరిశీలకుడు రోణంకి కృష్ణంనాయుడు అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఆవర ణలో టీడీపీ మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జీవన్ చంద్రన్, ఎంపీడీవో రామకృష్ణారావు, డీటీ నిర్మల, ఏపీవో సీహెచ్ సత్యనా రాయణ, ఏపీఎం ఆర్. రామకృష్ణంనాయుడు, కూటమి నాయకులు బూరాడ వెంకటరమణ, కూనుబిల్లి కూర్మారావు, తదితరులు పాల్గొన్నారు.