Share News

బాలల హక్కుల పరిరక్షణకు కృషి

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:11 AM

నేటి బాలలే రేపటి సమాజ నిర్మాణానికి పునాదిరాళ్లని, వారి హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయా లని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్‌లో గురువారం ముందస్తు బాలల దినోత్సవాన్ని ఐసీడీఎస్‌తో కలిసి నిర్వహించారు.

బాలల హక్కుల పరిరక్షణకు కృషి
విజేతకు బహుమతి అందజేస్తున్న జిల్లా న్యాయాధికారి సునీత

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు

న్యాయసేవాసదన్‌లో ముందస్తు బాలల దినోత్సవం

విజేతలకు బహుమతులందించిన జిల్లా న్యాయాధికారి సునీత

శ్రీకాకుళం లీగల్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): నేటి బాలలే రేపటి సమాజ నిర్మాణానికి పునాదిరాళ్లని, వారి హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయా లని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్‌లో గురువారం ముందస్తు బాలల దినోత్సవాన్ని ఐసీడీఎస్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు జిల్లా న్యాయాధికారి కొండబోలు సునీత బహు మతులు అందించారు. అనంతరం న్యాయాధికారి హరిబాబు మాట్లాడుతూ.. పిల్ల ల హక్కులను కాపాడడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు కృషి చేయాలన్నారు. పిల్లలకు రాజ్యాంగం అనేక హక్కులను కల్పించిందని, వీటిపై వారికి పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నా మన్నారు. బాల్య వివాహాలను నిరోధించడం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పిల్లల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోక్సో చట్టం కఠినంగా అమలయ్యేలా పోలీసు వ్యవస్థ కృషి చేయాలన్నారు. పిల్లలు మంచి ప్రవర్తన, విలువలతో కూడిన జీవనం సాగించి నప్పుడే మంచి సమాజం తయారవు తుందన్నారు. డీసీపీవో రమణ బాల్యవివా హాలను అరికట్టేం దుకు పాటుపడతామని పేర్కొంటూ విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్ర మంలో ప్యానల్‌ న్యాయవాదులు గేదెల ఇందిరా ప్రసాద్‌, వాడపల్లి జోతిర్మయి, జిల్లా ఉప విద్యా శాఖాధికారి విలియమ్స్‌, సర్వశిక్షా అభియాన్‌ అధికారులు వరుదు ఉమాదేవి, రామకృష్ణ, డీసీపీవో అధికారులు లక్ష్మునాయుడు, సీతారం, ఎచ్చెర్ల, గార, లావేరు, శ్రీకాకుళం కేజీబీవీ విద్యార్థినులు పాల్గొన్నారు.

‘లైంగిక నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి’

పొందూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): సమాజంలో బాలికలు, యువతులు, చిన్నపిల్లల పట్ల జరుగుతున్న లైంగిన వేధింపులు, నేరాలపై అప్రమత్తంగా ఉండా లని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.జ్యోత్స్న అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ముందస్తు బాలల దినోత్సవం, న్యాయవిజ్ఞాన సదస్సును ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోక్సో చట్టంపై అవగాహన పెంచాలని, పిల్లలపై లైంగిక వేధింపులు అడ్డుకోవడం ప్రతిఒక్కరి భాద్యతని అని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాము, సంతోష్‌కుమార్‌, ఎంఈవో-2 పి.రాజారావు, ఇన్‌చార్జి హెచ్‌ ఎం సుజాత, ఏఎస్‌ఐ త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 12:11 AM