ఎన్టీఆర్ పాఠశాల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:16 AM
తాను దత్తత తీసుకున్న నగరంలోని ఎన్టీఆర్ మునిసి పల్ హైస్కూల్‌ను మరింత అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
అరసవల్లి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): తాను దత్తత తీసుకున్న నగరంలోని ఎన్టీఆర్ మునిసి పల్ హైస్కూల్‌ను మరింత అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. లాసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.3.50 లక్షలతో నవీకరించిన ఏసీ తరగతి గదిని శుక్రవారం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి ప్రారంభించారు. అఽధునాతన డిజిటల్ బోర్డు, ఏసీ, సౌక ర్యంగా బెంచీలు, విజ్ఞానాన్ని పెంచేలా గోడలపై పెయింటింగ్ వేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే తరహా మరిన్ని ఏర్పాటు చేయాలని లా సా ప్రతినిధులను కోరారు. విద్యార్థులతో ముచ్చ టించి పాఠశాలలో వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, పాఠ శాల సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం గీటురాయి: శంకర్
అరసవల్లి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమమే కూటమి పాలన కు గీటురాయి అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నా రు. స్థానిక మునిసిపల్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన రెండేళ్ల పాలన కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. సంక్షేమ పథకాలతో పాటు జిల్లాలో రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనపై కూట మి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. యువతకు ఉపాధి కల్పనకు ఉద్యోగ మేళాలు నిర్వహించి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తోం దన్నారు. కూటమి నేతలు పాల్గొన్నారు.