Share News

ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ సమగ్రాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:44 PM

ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ పట్టణాల సమగ్రాభి వృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశలో కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ సమగ్రాభివృద్ధికి కృషి
పలాస మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన వజ్జ గంగాభవానిని అభినందిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

విజేతలకు అభినందన

శ్రీకాకుళం అర్బన్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ పట్టణాల సమగ్రాభి వృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశలో కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఇటీ వల జరిగిన పురపాలక ఎన్నికల్లో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌లుగా ఎన్నికైన ఆశి లీలా రాణి, వజ్జ గంగాభవాని శుక్రవారం కేంద్ర మంత్రి ని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలి శారు. ఈ సందర్భంగా ఆయన వారిని సత్కరిం చి అభినందించారు. రెండు పట్టణాల అభి వృద్ధికి పలు కీలక అంశాలపై వారితో చర్చించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, టీడీపీ నేత వెంకన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ కార్యాలయంలో..

శ్రీకాకుళం అర్బన్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్ని కైన వజ్జ గంగా భవాని, కౌన్సిలర్లను టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌ అభినందించారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్ర వారం విజేతలకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విజ యం కూటమి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషికి నిదర్శనమని, ప్రజల నమ్మకాన్ని నిలబెడు తూ పట్టణాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:44 PM