సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:27 PM
కంచిలి మండ లంలోని రైతులకు ఏళ్ల తరబడి ఉన్న సాగునీటి సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తానని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ హామీ ఇచ్చారు.
కవిటి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): కంచిలి మండ లంలోని రైతులకు ఏళ్ల తరబడి ఉన్న సాగునీటి సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తానని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ హామీ ఇచ్చారు. రామయ్యపుట్టుగలోని తన నివాసం వద్ద సోమవారం సుంకిలిసాగరం ఆయకట్టు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం పరిధి నాలుగు మండలాల్లోని సాగునీటి వనరు లను అభివృద్ధి చేసి ప్రతీ రైతుకు 2027 నాటికి సాగునీరందించేందుకు చర్యలు చేపడుతున్నా నన్నారు. సుంకిలి సాగరంలోకి వచ్చే నీరు నిల్వ ఉండేలా.. అక్కడి నుంచి 9 గొలుసుకట్టు చెరువు ల్లోనూ నీరు చేరేలా సర్వే చేయించామన్నారు. ఈ సర్వే ఆధారంగా రూ.36 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదికను అందించామన్నారు. ఆర్థి క శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చేలా చర్యలు తీసు కుంటున్నానన్నారు. 19 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఇచ్ఛాపురంలో 139, కంచిలిలో 87, కవిటిలో 62, సోంపేటలో 66 సాగునీటి కాలువ లకు రూ.4 కోట్లు ఉపాధి నిధులు వెచ్చించి మెరుగు పరిచామన్నారు. పోరాట కమిటీ ప్రతినిధులు డి.దాలిబందు, పి.సూర్య నారాయణ, కృష్ణారావు, రమేష్ మహం తి, చిన్నబాబు మాట్లా డుతూ.. కంచిలి మం డలంలో ప్రధాన సాగునీటి వనరైన సుంకిలి సాగ రాన్ని మెరుగుపరచాలని కోరారు. సమావేశంలో స్థానిక నాయకులు ఎం.రామారావు, పి.శివాజీ, జి.మన్మథరావు, జల వనరుల శాఖాధికారులు పాల్గొన్నారు.