Share News

ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి: కలిశెట్టి

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:11 AM

ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి: కలిశెట్టి
సమస్యలు తెలుసుకుంటున్న ఎంపీ కలిశెట్టి

రణస్థలం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. అర్జునవలస గ్రామంలో శుక్రవారం ప్రజా దర్బార్‌ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పార్టీ క్యాడర్‌తో సమావేశం నిర్వ హించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్‌తో పాటు పార్టీ క్యాడర్‌ తో సమావేశాలు నిర్వహిస్తున్నా మన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు లంక శ్యామలరావు, నేతలు బెండు మల్లేశ్వరరావు, కొమరాపు రవి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పిన్నింటి భానోజినాయుడు, చౌదరి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:11 AM