సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:42 PM
సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ అన్నారు.
అరసవల్లి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ అన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరం లోని డీసీసీబీ వద్ద రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు రెండోరోజు గురువారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన శిబిరాన్ని సందర్శించి సమస్యలపై చర్చిం చారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను మంత్రి దృష్టికి తీసు కువెళతామని హామీ ఇచ్చారు. జీవో నెంబరు 36 అమలుకు కృషి చేస్తామన్నారు. సంఘ నాయకుడు గిరిబుచ్చి రంగనాథ్, సీఐ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను ఎన్నిసార్లు ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో 49 సంఘాల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాల్సి వచ్చిం దన్నారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ ఎంప్లా యీస్ యూనియన్ అధ్యక్షుడు గొండు మురళి, కార్యదర్శి కామరాజు, ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శిమ్మ జగదీష్, పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి మెండ సత్యనారాయణ, కన్వీ నర్ బి.సన్యాసిరావు, కోశాధికారి కె.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.