రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:53 AM
రైలు ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే విప్ బెందాళం అశోక్ తెలిపారు.
కంచిలి, మార్జి 13 (ఆంధ్రజ్యోతి): రైలు ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే విప్ బెందాళం అశోక్ తెలిపారు. మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫారంలపై నూతనంగా ఏర్పాటు చేసిన కోచ్‌ల స్థితిని తెలిపే డిజిటల్ బోర్డులను శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్ఛాపురం, సోంపేట, బారువ రైల్వే స్టేషన్‌లలో వివిధ రైళ్ల నిలుపుదలకు చర్యలు తీసుకున్నామన్నారు. రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద అండర్ పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఖుర్దా రైల్వే డివిజన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు శ్రీనివాసరౌళో, పీఏసీఎస్ అధ్యక్షుడు పైల పురుషోత్తం రెడ్డి, కూటమి నాయకులు జగదీష్ పట్నాయక్, బంగారు కురయ్య, రిటైర్డ్ టీటీ లోళ్ల సూర్యనారాయణ, సోంపేట సీఐ బి.మంగరాజు, ఎస్‌ఐ పారినాయుడు తదితరులు పాల్గొన్నారు.