Share News

సమస్యల పరిష్కారానికి కృషి: శంకర్‌

ABN , Publish Date - May 29 , 2026 | 11:41 PM

ప్రజా సమస్యల పరిష్కరించే దిశలో ప్రజలకు అందు బాటులో ఉంటున్నానని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి: శంకర్‌
ఫిర్యాదులను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం రూరల్‌, మే 29(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కరించే దిశలో ప్రజలకు అందు బాటులో ఉంటున్నానని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శుక్రవారం కిష్టప్పపేటలో ‘ఒక నెల ఒక గ్రామంలో నాలుగు సందర్శనలు’ కార్యక్రమం శుక్రవారం నిర్వహిం చారు. గ్రామంలోని భూ సమస్యల పరిష్కారా నికి శ్రీకాకుళం రూరల్‌, గార మండల రెవెన్యూ అధికారులు రికార్డులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న భూ వివాదాలు, పట్టాదారు పాస్‌ బుక్స్‌, సర్వే సమస్యలు, రికార్డు ల సవరణ తది తర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరత గతిన పరిష్కరించాలని అధికా రులకు సూచిం చారు. గ్రామస్థుల నుంచి సమ స్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిం చడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్ర మంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పంచాయతీ కార్య దర్శి ఎం.శ్యామ్‌ సుందరరావు పాల్గొన్నారు.

‘నాణ్యమైన విద్య లక్ష్యం’

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి నాణ్య మైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. కిష్టప్పపేటలో శుక్రవారం ‘బడిపిలుస్తోంది’ కార్య క్రమం నిర్వ హించారు. పలువురు విద్యార్థులను గ్రామంలోని జడ్పీహైస్కూల్‌లో చేర్పించారు. కార్యక్రమంలో ఎంఈవో కృష్ణారావు, హెచ్‌ఎం ఎస్‌.సాయి సంధ్య తదితరులు పాల్గొన్నారు. కిష్టప్పపేట జడ్పీ హెచ్‌ఎస్‌కు మీనాక్షి హాస్పిటల్‌ యాజమాన్యం అందించిన బీరువాలు, కుర్చీలను ఎమ్మెల్యే శంకర్‌ హెచ్‌ఎంకు అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్య ప్రతినిధులను ఆయన అభినందించారు.

Updated Date - May 29 , 2026 | 11:41 PM