జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:50 PM
జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
అరసవల్లి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆదివారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) జిల్లా మహాసభ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సమాజ చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టులుగా రావాలనుకునే వారు సీనియర్లతో శిక్షణ పొందాలని, అప్పుడు సత్ఫలి తాలు వస్తాయన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. విలు వలతో కూడిన జర్నలిజంతో సమాజంలో గౌర వాన్ని ఇనుమడింప చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ.. నేడు సోషల్ మీడియాలో యూట్యూబర్ల పేరుతో చాలామంది చేస్తున్న ప్రచారాలు బాధాకరంగా ఉంటున్నాయన్నారు. జర్నలిస్టు సంఘం నాయ కులు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు రైలు ప్రయాణ రాయితీ పునరుద్ధరించాలని, ఇళ్లు కేటాయించాలని, పిల్లలకు చదువుల్లో సహకరిం చాలని, ఆరోగ్య కార్డులు ఇవ్వాలని కోరారు. కార్య క్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మార్క్‌ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ ఆనెపు రామకృష్ణం నాయుడు, ఏపీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సీహెచ్ కృష్ణాంజనేయులు, రాష్ట్ర అధ్యక్షుడు పి. శివరాజేష్, రాష్ట్ర కార్యదర్శి ఎస్.జోగినాయుడు, ఉపాధ్యక్షుడు గాంధీబాబు, జిల్లా అధ్యక్షుడు షన్ముఖరావు, టీడీపీ నేత పీఎంజేబాబు, వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు, పెద్ద ఎత్తున జర్నలిస్టులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.