Share News

సమస్యల పరిష్కారానికి కృషి: ఎన్‌ఈఆర్‌

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:44 PM

ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.

 సమస్యల పరిష్కారానికి కృషి: ఎన్‌ఈఆర్‌
ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌కు వినతిపత్రం ఇస్తున్న నేతలు

రణస్థలం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో పబ్లిల్‌ గ్రీవెన్స్‌ నిర్వహించి సమస్యలపై వినతిపత్రాలను స్వీకరిం చారు. రోడ్లు, తాగునీరు, పింఛన్లు, ఇళ్ల మంజూరు తదితర 15 అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో కూటమి నాయకులు ముప్పిడి సురేష్‌, కుమరాపు రవికుమార్‌, నక్క మురళి, డబ్బాడ ఆదినారాయణ, బోగాది అప్పలనాయుడు, సంప తరావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి: శంకర్‌

అరసవల్లి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో సమస్యల పరిష్కారంలో పార్టీ నేతలు, కార్యకర్తలు కీలకపాత్ర పోషించా లని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. స్థానిక విశాఖ-ఎ కాల నీలోని తన క్యాంప్‌ కార్యాలయంలో శనివారం పార్టీ నాయ కులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోని సమస్యలను గుర్తించి వాటిని తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారంపై అధికారు లకు సూచిస్తానన్నారు. రహదారులు, తాగునీరు, విద్యుత్‌, కాలువలు, పారిశుధ్యం తదితర అంశాలపై దృష్టి సారించాల న్నారు. అమరావతి రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహిం చాలని కోరారు. ఆదివారం ప్రతీ ఇంటి ముందు అమరావతిని ప్రతి బింబించేలా ప్రత్యేక ముగ్గులు వేయాలని, ఇది ప్రజలందరి విజయంగా సంబరాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పీజీపేట, కె.మత్స్యలేశం, కల్లేపల్లి, కిల్లిపాలెం గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:45 PM